Imran: గోవును చంపి మత ఘర్షణలు రేకెత్తించే యత్నం.. ఎట్టకేలకు చిక్కిన నిందితుడు

  • గోవును చంపి మాంసభాగాలను చెల్లాచెదురుగా పడేసిన ఇమ్రాన్
  • హోలీ రోజున ఘటన
  • అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు

గోవును వధించి మతఘర్షణలు రేకెత్తించేందుకు ప్రయత్నించిన ఇమ్రాన్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడి తలపై రూ.25 వేల రివార్డు కూడా ఉంది. హోలీ రోజున  గోవును వధించిన ఇమ్రాన్ దాని మాంస భాగాలను హర్ష్ విహార్ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడేసి మతఘర్షణలు రేకెత్తించేందుకు ప్రయత్నించాడు.

గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆవును వధించిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి మతఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇరు వర్గాల పెద్దలను పిలిపించి మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్వేజ్, లుక్‌మన్, ఇన్సాల్లామ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ మాత్రం అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో తలదాచుకున్నాడు. అయితే, ఎట్టకేలకు బుధవారం పోలీసులకు చిక్కాడు.

తన కుటుంబానికి గోవులు కొని, విక్రయించే వ్యాపారం ఉందని ఇమ్రాన్ తెలిపాడు. మత ఘర్షణలు రేకెత్తించే ఉద్దేశంతో గోవును చంపి దాని భాగాలను వీధిలో చెల్లాచెదురుగా పడేసినట్టు అంగీకరించాడు.

More Telugu News