Telangana: ఐదేళ్లలో ‘సింగరేణి’ ఆదాయం రూ.25,828 కోట్లకు పెరిగింది: కేటీఆర్

  • సింగరేణి సంస్థ గణనీయమైన అభివృద్ధి సాధించింది
  • 17 శాతం వృద్ధి నమోదు చేసింది
  • ప్రాఫిట్ గ్రోత్ రూ.1600 కోట్లకు చేరింది
సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ గణనీయమైన అభివృద్ధి సాధించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనియాడారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. గడచిన ఐదేళ్లలో సింగరేణి సంస్థ ఆదాయం రూ.11,928 కోట్ల నుంచి రూ.25,828 కోట్లకు పెరిగిందని,117 శాతం వృద్ధి నమోదు చేసిందని అన్నారు. ప్రాఫిట్ గ్రోత్ రూ.419 కోట్ల నుంచి రూ.1600 కోట్లకు చేరిందని, దాదాపు 282 శాతం లాభం నమోదైనట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ, ఉద్యోగులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
Telangana
cm
kcr
KTR
singareni
coal

More Telugu News