Kurnool District: నంద్యాల ఎస్‌ఆర్‌బీసీ కాలనీ పరిసరాల్లో చిరుత పులి సంచారంతో ఆందోళన

  • పాదముద్రలు చూసి వాస్తవమేనని ప్రకటించిన అటవీ శాఖ
  • పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు
  • త్వరలోనే పట్టుకుంటామని స్పష్టీకరణ
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం పరిధిలోని ఎస్‌ఆర్‌బీసీ కాలనీ పరిసరాల్లో ఓ చిరుత పులి సంచరిస్తోందన్న సమాచారం స్థానికంగా కలకలానికి కారణమైంది. తమ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందన్న అనుమానం వచ్చిన స్థానికులు అటవీ శాఖకు సమాచారం అందించారు. వారు వచ్చి పాదముద్రలు పరిశీలించి చిరుత సంచారం వాస్తవమేనని చెప్పడంతో ఒక్కసారిగా అలజడి, ఆందోళన మొదలయ్యింది. స్థానికుల భయాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. చిరుత సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని డీఎఫ్‌ఓ శంకరరెడ్డి తెలిపారు.
Kurnool District
nadyala
cheatha

More Telugu News