Gujarath: మూడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం.. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

  • 116 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
  • కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 14 రాష్ట్రాల్లో పోలింగ్
  • అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసిన అధికారులు

రేపు జరగనున్న మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 14 రాష్ట్రాల్లో మొత్తం 116 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గుజరాత్‌లో 26, కేరళలో 20, మహారాష్ట్రలో 14, కర్ణాటకలో 14, ఉత్తరప్రదేశ్‌లో 10, ఛత్తీస్‌గఢ్ 7, ఒడిశా 6, బీహార్ 5, పశ్చిమబెంగాల్‌ 5, అసోంలో 4, గోవాలో 2, దమన్ 1, జమ్మూకశ్మీర్ 1, దాద్రానగర్ హవేలీలో ఒకచోట పోలింగ్ జరగనుంది.  

  • Loading...

More Telugu News