Telugudesam: టీడీపీ, వైసీపీలు నాపై దాడి చేయాలని చూస్తున్నాయి: ఈసీకి కేఏ పాల్ ఫిర్యాదు

  • టీడీపీ, వైసీపీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి
  • నాపై దాడులు చేసేందుకు చూస్తున్నాయి
  • నాకు భద్రత కల్పించండి

ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ విషయమై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి కూడా ఫిర్యాదులు చేసుకున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరపున పోలీసులే స్వయంగా డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాజాగా, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ కూడా ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ, వైసీపీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, తనపై దాడులు చేసేందుకు చూస్తున్నాయని, తనకు భద్రత కల్పించాలని కోరారు. 

Telugudesam
YSRCP
Praja shanti party
ka pal
EC
  • Loading...

More Telugu News