Hyderabad: ప్రత్యేక ప్రధాని కావాలన్న ఫరూక్ అబ్దుల్లాతో కలిసి చంద్రబాబు ప్రచారమా!: ప్రధాని మోదీ

  • జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక పీఎం కావాలంటున్నారు
  • దీనిపై కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి
  • ఫరూక్ వ్యాఖ్యలకు ‘మహాకూటమి’ మద్దతిస్తుందా?
దేశానికి ఇద్దరు ప్రధానులు ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ కోరుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, ‘జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలి’ అని ఫరూక్ అబ్దుల్లా అన్నారని, దానికి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు ‘మహాకూటమి’ మద్దతు ఇస్తుందా?అని ప్రశ్నించారు. ఎవరు దేశభక్తులో ఎవరు పాకిస్థాన్ ఏజెంట్లో ప్రజలు గమనించాలని కోరారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలంటున్న ఫరూక్ అబ్దుల్లాతో కలిసి ఏపీలోని యు-టర్న్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారని మోదీ విమర్శించారు.  
Hyderabad
LB stadium
bjp
modi
pm

More Telugu News