akkineni amala: డ్రైనేజీ కాల్వను శుభ్రం చేసిన అక్కినేని అమల

  • నిజామాబాద్ జిల్లాలో ఓ శుభకార్యక్రమానికి హాజరైన అమల
  • స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చెత్తగా ఉన్న డ్రైనేజీ కాల్వ
  • చీపురు చేతబట్టి కాల్వను శుభ్రం చేసిన అమల

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా ఉండే అమల నిజామాబాద్ జిల్లా బోధన్ లోని ఖండ్ గాంలో ఓ శుభకార్యక్రమానికి హజరయ్యారు. గ్రామంలో కార్యక్రమం పూర్తయిన తర్వాత స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.

అక్కడున్న మురుగు కాల్వ మొత్తం చెత్తగా ఉండటంతో... స్వయంగా చీపురు పట్టి మురుగు కాల్వలోని చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా అమల చేతికి గ్లోవ్స్ కూడా వేసుకోకుండా... ఎంతో చిత్తశుద్ధితో ఆ పనిని పూర్తి చేసి అందరితో 'ఔరా' అనిపించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎవరి గ్రామాన్ని వారే శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

More Telugu News