Ananthapuram: వైఎస్ రాజశేఖర రెడ్డి తెలివైన ఫ్యాక్షనిస్టు: జేసీ దివాకర్ రెడ్డి

  • మేము ఫ్యాక్షనిస్టులం కాదు
  • మా చేతికి రక్తపు మరకలు అంటలేదు
  • ఆస్తి కోసమో, ఆడదాని కోసమో చంపుకునే వాళ్లు ఫ్యాక్షనిస్టులు

వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఫ్యాక్షనిస్టు’ అని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్టా?’ అనే ప్రశ్నకు జేసీ స్పందిస్తూ, ‘ఫ్యాక్షనిస్టు.. తెలివైన ఫ్యాక్షనిస్టు’ అని బదులిచ్చారు. ‘మీరు నమ్మినా, నమ్మకపోయినా మా చేతికి రక్తపు మరకలు అంటలేదు. ఫ్యాక్షనిస్టులం కాదు’ అని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ‘నా అభిప్రాయం ప్రకారం ఫ్యాక్షనిస్టు అంటే, ఆస్తి కోసమో, ఆడదాని కోసమో, ఇంకో దాని కోసమో చంపుకోవడం. మాకు అలాంటివి లేవు’ అని జేసీ అన్నారు.

  • Loading...

More Telugu News