Krishna District: అభినవ శిశుపాలుడు చంద్రబాబు.. ‘ఫ్యాన్’ చక్రం తగిన బుద్ధి చెబుతుంది: వైఎస్ జగన్

  • శిశుపాలుడిని విష్ణు చక్రం సంహరించింది
  • మోసాలు చేసిన బాబుకు ‘ఫ్యాన్’ చక్రం బుద్ధిచెబుతుంది
  • ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఒరగబెట్టిందేమీ లేదు

వంద తప్పులు చేసిన శిశుపాలుడిని విష్ణు చక్రం సంహరించిందని, మరి, ఎన్నో మోసాలు చేసిన చంద్రబాబును ‘ఫ్యాన్’ చక్రం ఓడిస్తుందని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహిస్తున్న వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ, అభినవ శిశుపాలుడు చంద్రబాబు అని, ఐదేళ్ల పాలనలో ఆయన ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.

ఏపీ ప్రజలు తనను ‘పెద్దకొడుకు’గా భావిస్తున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ ఘాటు విమర్శలు చేశారు. 'ఈయన పెద్దకొడుకుట. మీరే మన్నా ఆయన్ని దత్తత తీసుకుంటారా?’ అని సెటైర్లు విసిరారు. తనకు పిల్ల నిచ్చిన మామనే చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా వదల్లేదని, ఇక, ఈయనను పెద్దకొడుకుగా మనం దత్తత తీసుకుంటే, మనం బ్రతుకుతామా? అని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని, తమ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను ఈ సందర్భంగా జగన్ కోరారు.

More Telugu News