ప్రేమ గురించి చెబితే.. పెళ్లి గురించి వరుసపెట్టి వార్తలు రాస్తూనే ఉంటారు: ఆలియా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమ గురించి చెబితే.. పెళ్లి గురించి వరుసపెట్టి వార్తలు రాస్తూనే ఉంటారు: ఆలియా

  • నా మైండ్‌లో పెళ్లి అనేదే లేదు
  • నేను వ్యతిరేకించడం లేదు
  • నాకు చాలా పని ఉంది
  • ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రేమజంట ఎక్కడ కనిపించినా మీడియా ‘పెళ్లెప్పుడు?’ అని ప్రశ్నించడం కామన్. బాలీవుడ్ ప్రముఖ నటులు ఆలియా, రణబీర్ కపూర్‌ల ప్రేమ వ్యవహారం తెలిసినప్పటి నుంచి వారికి కూడా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. అయితే ఆలియా మాత్రం వ్యక్తిగత జీవితం మరొకరితో పంచుకోలేనిదని అర్థం చేసుకోవాలని చెబుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆలియాను రణబీర్ గురించి అడగ్గా.. ఆమె ప్రస్తుతం తన మైండ్‌లో పెళ్లి ప్రస్తావన అనేదే లేదని చెప్పింది.

‘వ్యక్తిగత జీవితం అంటే మరొకరితో పంచుకోలేనిదని అర్థం చేసుకోవాలి. అందుకే చాలా మంది సెలబ్రిటీలు తమ ప్రేమ గురించి చెప్పరు. ఒకవేళ చెబితే.. పెళ్లి గురించి వరుసపెట్టి వార్తలు రాస్తూనే ఉంటారు. ప్రస్తుతం నా మైండ్‌లో పెళ్లి అనేదే లేదు. అలాగని పెళ్లిని వ్యతిరేకించడం లేదు. కానీ ఇప్పుడు నా ప్లాన్‌లో అది భాగం కాదు. నాకు చాలా పని ఉంది. దీని అర్థం పెళ్లి జరిగిన తర్వాత నేను పనిచేయనని కాదు. ఇప్పుడు మాత్రం నా దృష్టి అంతా పని మీదే ఉంది. సమయాన్ని బట్టి నా ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి’ అని ఆలియా చెప్పారు.
Aliya
Ranabeer Kapoor
Media
Marriage
Industry

More Telugu News