Jagan: వైఎస్ జగన్ బస్సు యాత్ర రద్దు... హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటన!

  • ప్రచారం చేసుకునేందుకు 27 రోజుల సమయం
  • బస్సులో తిరిగితే ఆలస్యమయ్యే అవకాశం
  • 16 నుంచి జగన్ ప్రచార షెడ్యూల్
ఎన్నికల షెడ్యూల్ ముంచుకురావడం, ప్రచారం చేసుకునేందుకు ఇంకో 27 రోజులు మాత్రమే ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను రద్దు చేసుకుని, హెలికాప్టర్ లో రాష్ట్రాన్ని చుట్టి రావాలని నిర్ణయించింది. వాస్తవానికి పాదయాత్ర ముగియగానే బస్సుయాత్రను నిర్వహించాలని జగన్ భావించారు. దాన్ని ప్రారంభించేలోగానే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన తరువాత ఈ నెల 16నుంచి, జగన్ హెలికాప్టర్ ను వాడుతూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. రేపు ఆయన విజయవాడలో జరిగే సమర శంఖారావ సభలో పాల్గొంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.
Jagan
Bus Yatra
Helecopter

More Telugu News