మొహాలీ వన్డే.. 358 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్

  • 143 పరుగులతో విరుచుకుపడ్డ ధావన్
  • 95 పరుగుల వద్ద ఔట్ అయి.. సెంచరీ మిస్ అయిన రోహిత్
  • ఆసీస్ విజయలక్ష్యం 359 పరుగులు
మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. తద్వారా ఆసీస్ కు 359 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకు ముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ధావన్ 143 (115 బంతులు) పరుగులతో వీర విహారం చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 95 (92 బంతులు) పరుగుల వద్ద ఔట్ అయి, సెంచరీనీ తృటిలో కోల్పోయాడు. వీరిద్దరూ 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం కోహ్లీ 7, పంత్ 36, జాధవ్ 10, విజయ్ శంకర్ 26, భువనేశ్వర్ కుమార్ 1, చాహల్ 0 పరుగులు చేశారు. కుల్దీప్ యాదవ్ 1, బుమ్రా 6 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. ఇన్నింగ్స్ చివరి బంతిని మాత్రమే ఎదుర్కొన్న బుమ్రా... ఆ బంతిని సిక్సర్ గా మలిచాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 5 వికెట్లను పడగొట్టగా రిచర్డ్ సన్ 3, జంపా ఒక వికెట్ తీశారు.
Go Back to Shorts
mohali
odi
india
australia
score

More Telugu News