Anant Ambani: అనంత్ అంబానీకి అరుదైన గౌరవం ఇచ్చిన ఉత్తరాఖండ్!

  • బద్రీనాథ్, కేదార్ నాథ్ దేవస్థానాల కమిటీలో సభ్యుడిగా నియామకం
  • ప్రకటించిన రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్
  • ఆలయం అభివృద్ధి చెందుతుందంటున్న భక్తులు

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఆయన్ను ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్, కేదార్ నాథ్ దేవస్థానాల కమిటీలో సభ్యుడిగా నియమిస్తున్నట్టు రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. బద్రీనాథుని భక్తుడైన అనంత్, ప్రతియేటా ఆలయాన్ని సందర్శిస్తుంటారు. అటువంటి అనంత్ ను కమిటీలో తీసుకోవడంతో, ఆలయం మరింతగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్టు భక్తులు చెబుతున్నారు. కాగా, రేపు అనంత్ సోదరుడు ఆకాశ్ అంబానీ వివాహం, శ్లోకా మెహతాతో జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News