ap govt: ఏపీ ప్రభుత్వ సమాచారం చోరీ.. హైదరాబాదులో సోదాలు

  • సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ఓటరు కార్డులు, ఆధార్ కార్డుల సమాచారం చోరీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి
  • కూకట్ పల్లిలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం చోరీ అయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు చోరీ అయ్యాయి. ఈ మేరకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కూకట్ పల్లిలో ఉన్న బ్లూ ఫ్రాగ్ మొబైల్స్ టెక్నాలజీ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు ఆ సంస్థలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ap govt
information
theft
vijayasai reddy
ysrcp

More Telugu News