Andhra Pradesh: రూ.30,000 కోట్లు వసూలు చేశానంట.. నన్ను మళ్లీ అరెస్ట్ చేయబోతున్నారు!: కేఏ పాల్ ఆరోపణ

  • నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు
  • ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తు వచ్చేసింది
  • అసెంబ్లీ టికెట్లు ఇంకా ఎవరికీ ఇవ్వలేదు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు రూ.30,000 కోట్లు వసూలు చేసినట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాల్ మండిపడ్డారు. ఈ అసత్య ప్రచారం ఆధారంగా తనను మరోసారి అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్ మాట్లాడారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంకా ఎవరికీ టికెట్లు ఇవ్వలేదని పాల్ స్పష్టం చేశారు. తమ పార్టీకి ఎన్నికల సంఘం హెలికాప్టర్ గుర్తును కేటాయించిందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News