Manohar Parrikar: దేవుడి దయతోనే పారికర్ ఇంకా బతికున్నారు: గోవా డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు!

- ఆయన కాలం చేస్తే రాష్ట్రంలో సంక్షోభమే
- పారికర్ ఆరోగ్యం అసలు బాగాలేదు
- డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, చికిత్స తీసుకుంటూనే విధులకు హాజరవుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పై ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో సంచలన వ్యాఖ్యలు చేశారు. పారికర్ ఆరోగ్యం అసలు బాగాలేదని, ఆయనకు వ్యాధి నయం కాలేదని అన్నారు. దేవుని దయతోనే ఆయన ప్రాణాలతో ఉండి ముఖ్యమంత్రిగా విధుల్లో ఉన్నారని అన్నారు. ఆయన పదవికి రాజీనామా చేసినా, మరణించినా గోవాలో రాజకీయ సంక్షోభం తప్పదని అన్నారు.
కాగా, 63 ఏళ్ల పారికర్ ప్రస్తుతం పాంక్రియాటిక్ క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య అమెరికాలో చికిత్సకు వెళ్లి వచ్చిన ఆయన, ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గతంలో పారికర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మైఖేల్ లోబో, ఇప్పుడాయన గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.