Andhra Pradesh: చెల్లని చెక్కులు ఇచ్చే అలవాటు రోజాకే ఉంది: బుద్ధా వెంకన్న

  • రోజా ఎప్పుడైనా నిజం చెప్పారా?
  • చెక్కులు చెల్లలేదని ఎవరైనా చెప్పారా?
  • సినీ రంగంలో ఉన్నప్పుడు ఆమె చెల్లని చెక్కులు ఇచ్చింది!
డ్వాక్రా మహిళలకు మూడు చెక్కులిచ్చేసి పండగ చేసుకోండని చంద్రబాబు అంటున్నారంటూ వైసీపీ నేత రోజా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటు కౌంటర్ ఇచ్చారు. రోజా ఎప్పుడైనా నిజం చెప్పారా? ఈ చెక్కులు తీసుకున్న వారెవరైనా చెల్లలేదని చెప్పారా? అని ప్రశ్నించారు. చెల్లని చెక్కులు ఇచ్చే అలవాటు రోజాకే ఉంది కనుక, ఈ చెక్కులు కూడా చెల్లనివని ఆమె అనుకుంటోందని సెటైర్లు విసిరారు. సినీ రంగంలో ఉన్నప్పుడు ఆమె చెల్లని చెక్కులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసని రోజాపై సెటైర్ వేశారు. 
Andhra Pradesh
Telugudesam
buddha venkanna
YSRCP
roja
Dwacra
cheques
Tollywood

More Telugu News