KA Paul: ఒక అవినీతి పార్టీని వదిలి మరో అవినీతి పార్టీలోకి.. రాధాపై కేఏ పాల్ విమర్శలు

  • రాధాపై పాల్ తీవ్ర వ్యాఖ్యలు
  • తమ పార్టీలో కోటిమంది చేరబోతున్నారన్న పాల్
  • ఏపీలో తమ పార్టీ మొదటి స్థానంలో ఉందన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన వంగవీటి రాధాపై ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాధా ఒక అవినీతి పార్టీని వదిలిపెట్టి మరో అవినీతి పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మరో ఆరు రోజుల్లో ప్రజాశాంతి పార్టీ సత్తా ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు. వచ్చే నెల 9వ తేదీ నాటికి తమ పార్టీలో కోటి మంది చేరబోతున్నారని పేర్కొన్నారు. ఏపీలోని 79 స్థానాల్లో తమ పార్టీ ఇప్పటికే మొదటి స్థానంలో ఉందని పాల్ వివరించారు.

కాగా, మంగళవారం విలేకరులతో మాట్లాడిన పాల్.. రాధాకృష్ణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీలో చేరితే మంత్రిని చేస్తానని, ఒకవేళ తమ ప్రభుత్వం ఏర్పడలేని పక్షంలో రూ.100 కోట్లను రంగా ట్రస్టుకు విరాళంగా ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News