Congress: జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ.. ప్రియాంకా గాంధీకి యూపీ బాధ్యతలు!

  • ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాహుల్
  • వచ్చే నెల బాధ్యతల స్వీకరణ
  • సింధియా, వేణుగోపాల్ కూ పదవులు
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నియామకాలు చేపట్టింది. ప్రియాంకా గాంధీని ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీచేశారు. 2019, ఫిబ్రవరి మొదటివారంలో ప్రియాంక బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కు సైతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇక రాజస్తాన్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాను పశ్చిమ ఉత్తరప్రదేశ్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. యూపీ ప్రధాన కార్యదర్శిగా ఇన్నాళ్లూ పనిచేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు హరియాణా రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పార్టీ తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వుల కాపీని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
Congress
appointment
Rahul Gandhi
priyanka gandhi
aicc
general secretary

More Telugu News