ఫ్లిప్ కార్ట్: భారీ డిస్కౌంట్ లతో ఫ్లిప్ కార్ట్ 'రిప‌బ్లిక్ డే సేల్'

  • రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక సేల్ 
  • ఈనెల 20 నుండి 22 వరకు
  • ఎస్బీఐ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్

ఆన్ లైన్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ 'రిపబ్లిక్ డే' సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక సేల్ ను నిర్వహించనుంది. ఈనెల 20 నుండి 22 వరకు భారీ డిస్కౌంట్ లతో ఈ సేల్ జరగనుంది. దీనిలో భాగంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై రాయితీలు లభించనున్నాయి. అలాగే, వస్తువు కొనుగోలుపై ఎస్బీఐ కార్డులు ఉపయోగిస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. 75 శాతం వరకు టీవీ, అప్ల‌యెన్సెస్‌ వస్తువులపై డిస్కౌంట్ లభించనుండగా, 80 శాతం వరకు ఎలక్ట్రానిక్, యాక్స‌స‌రీ వస్తువులపై డిస్కౌంట్ లభించనుంది.

More Telugu News