TTD: హైదరాబాద్ లో వెంకన్న కల్యాణాన్ని రద్దు చేసిన టీటీడీ!

  • ఫిబ్రవరి 17న జరగాల్సిన శ్రీనివాస కల్యాణం
  • ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు
  • భారీ ఎత్తున విరాళాలు వసూలు చేస్తున్నట్టు గుర్తించిన టీటీడీ

హైదరాబాద్ లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో వచ్చే నెల 17న జరగాల్సిన శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ రద్దు చేసింది. శ్రీ దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కల్యాణం గత సంవత్సరం అక్టోబర్ లోనే జరగాల్సివుండగా, దాన్ని వాయిదా వేశారు. ఆపై శ్రీ శ్రీనివాస కల్యాణం ట్రస్ట్ పేరిట కరపత్రాలు, లేఖలు ముద్రించడం, విరాళాలు అందిస్తే వారిని కల్యాణ వేదికపై కూర్చోబెట్టడంతో పాటు, తిరుమలలో ఎల్-1 దర్శనం, స్వామి ప్రసాదాలు, శేషవస్త్రాలు అందిస్తామని చెబుతూ, భారీ ఎత్తున విరాళాలు తీసుకుంటున్నట్టు టీటీడీ గుర్తించింది. నిబంధనలను అతిక్రమించినట్టు తేల్చిన టీటీడీ, కల్యాణాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, తాము ఎలాంటి విరాళాలనూ స్వీకరించడం లేదని శ్రీనివాస కల్యాణం ట్రస్ట్ కార్యదర్శి బీ కృష్ణమరాజు వ్యాఖ్యానించారు.

TTD
Hyderabad
LB Stadium
Tirumala
  • Loading...

More Telugu News