TRS mlas: నేడు ఐదుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు గుంటూరు జిల్లాలో వైసీపీ సన్మానం

  • దాచేపల్లి మండలం గామాలపాడులో సభ
  • యాదవ సామాజికవర్గం ఎమ్మెల్యేలకు సత్కారం
  • చర్చనీయాంశమైన కార్యక్రమం

 తెలంగాణ శాసన సభకు ఎన్నికైన ఐదుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వైసీపీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్‌ తరపున ఎన్నికైన యాదవ సామాజిక వర్గానికి చెందిన సదరు ఎమ్మెల్యేలకు గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి కుమారుడు కోటయ్య ఆధ్వర్యంలో నేడు సత్కార కార్యక్రమం జరుగుతోంది. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా పల్నాడులోని యాదవులను ఏకంచేసే ప్రయత్నం జరుగుతోందని భావిస్తున్నారు.  

More Telugu News