Indonesia: ఇండోనేషియాలో సునామీ బీభత్సం.. 43 మంది మృతి.. ఎగసిపడుతున్న రాకాసి అలలు

  • ఇండోనేషియాను కుదిపేసిన భారీ సునామీ
  • 43 మంది మృతి.. వందలాదిమంది గల్లంతు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

సునామీ దెబ్బకు ఇండోనేషియా మారోమారు వణికింది. దక్షిణ సుమత్ర, జావా ద్వీపాల్లో ఏర్పడిన సునామీ 43 మందిని పొట్టన పెట్టుకుంది. 584 మంది గాయపడగా, వందలాదిమంది గల్లంతైనట్టు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. సముద్రంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా సునామీ సంభవించినట్టు పేర్కొంది. సునామీ కారణంగా తీరంలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి.

584 మంది గాయపడ్డారని, వందలాది ఇళ్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 26 డిసెంబరు 2004లో హిందూమహాసముద్రంలో వచ్చిన సునామీ 13 దేశాల్లో  2.26 లక్షల మందిని బలితీసుకుంది. వీరిలో 1.20 లక్షల మంది ఇండోనేషియన్లే ఉన్నారు.

Indonesia
tsunami
disaster agency
volcanic eruption
landslides
java
sumatra
  • Loading...

More Telugu News