Snakes: పెథాయ్ తుపాన్ తో అవనిగడ్డలో మళ్లీ పాముల కలకలం!

  • పొలాల్లో కనిపిస్తున్న పాములు
  • రక్తపింజరలు కనిపించడంతో కొట్టి చంపిన ప్రజలు
  • మళ్లీ మొదలైన భయాందోళనలు
పెథాయ్ ముప్పు తప్పిందిగానీ, దివిసీమ వాసులకు మరో రూపంలో కష్టం ముంచుకొచ్చింది. అవనిగడ్డ ప్రాంతంలో మరోసారి పాముల కలకలం మొదలైంది. ఈ ప్రాంతంలో పాములు మళ్లీ కనిపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు.

చెరువు అనే గ్రామంలో ప్రాణాంతకమైన రక్తపింజరలు బయటకు రావడంతో ప్రజలు వాటిని కొట్టి చంపారు. ఓ రైతు తన పొలంలో తడిసిన వరి పనలను సర్దుతుండగా, ఇవి కనిపించాయి. మరోవైపు దివిసీమలోనూ పలు ప్రాంతాల్లో విషసర్పాల సంచారం అధికమైంది. రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పలువురిని పాములు కాటు వేసిన సంగతి తెలిసిందే.
Snakes
Krishna District
Avanigadda

More Telugu News