Rajasthan: రాజస్థాన్ రాజకీయం: అశోక్ గెహ్లాట్ వైపు అధిష్ఠానం మొగ్గు.. సచిన్ పైలట్ వర్గీయుల ఆందోళన!

  • గెహ్లాట్, సచిన్ మధ్య పోటీ  
  • అందుబాటులో ఉండాలని గెహ్లాట్ కు ఆదేశాలు
  • రాహుల్ గాంధీ ఫైనల్ కాల్ చేస్తానన్నారన్న గెహ్లాట్

రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. అయితే, సీఎం అభ్యర్థులుగా, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపినట్టు, రాజస్థాన్ సీఎంగా ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.

తమకు అందుబాటులో ఉండాలని గెహ్లాట్ కు అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందినట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఈ క్రమంలో సచిన్ పైలట్ మద్దతుదారులు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఫైనల్ కాల్ చేస్తానని తనతో చెప్పారని అశోక్ గెహ్లాట్ తన వర్గీయులతో చెప్పినట్టు సమాచారం.

More Telugu News