kcr: కేసీఆర్ ని కలిసిన నటుడు ఆర్.నారాయణమూర్తి

  • ప్రగతిభవన్ లో కేసీఆర్ ని కలిసిన నారాయణమూర్తి
  • ఉద్యమం తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వేవ్
  • ప్రజలకు అమోఘమైన పాలన అందించాలని కోరా
సీఎం కేసీఆర్ కు ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతిభవన్ లో కేసీఆర్ ని నారాయణమూర్తి కలిశారు. కేసీఆర్ కు అభినందనలు తెలిపిన అనంతరం, మీడియాతో నారాయణమూర్తి మాట్లాడుతూ, నాలుగున్నరేళ్ల పాలన చూసి టీఆర్ఎస్ ను 88 స్థానాల్లో ప్రజలు గెలిపించారని, ఉద్యమం తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వేవ్ నడుస్తోందని అన్నారు. ప్రజలకు అమోఘమైన పాలన అందించాలని కేసీఆర్ ని కోరానని, భారత రాజకీయాల్లో కూడా ఆయన సేవల అవసరం ఉందని.. కేసీఆర్ ను ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారని నారాయణమూర్తి అన్నారు.
kcr
TRS
r.narayanamurthy
telangana bhavan

More Telugu News