Telangana: రేవంత్ రెడ్డి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం.. అర్ధరాత్రి జేసీబీలతో ప్రహరిగోడను కూల్చివేసిన దుండగులు!

  • గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్ లో ఘటన
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కాంగ్రెస్ కార్యకర్తల రాకతో ఉద్రిక్త పరిస్థితి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్ పర్యటన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కొందరు దుండగులు గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్ లో ఉన్న రేవంత్ రెడ్డి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నించారు. రాత్రికిరాత్రే ప్రహరిగోడను కూల్చేశారు.

మూడు జేసీబీలతో వచ్చిన దుండగులు సర్వే నంబర్ 127లో ఉన్న స్థలానికి రక్షణగా కట్టిన ప్రహరిగోడను పడగొట్టారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా గచ్చిబౌలి ప్రాంతానికి చేరుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Telangana
Congress
Revanth Reddy
arrest
wall
destroyed
jcbs

More Telugu News