Narendra Modi: ‘ఎందరో అమరవీరులు కన్న కలల సాకారం కోసం..’ అంటూ తెలుగులో ప్రసంగించిన ప్రధాని మోదీ

  • హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం
  • అలాగే, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాకు ఆదర్శం
  • పటేల్ పట్టుదల వల్లే హైదరాబాద్ కు విమోచనం కలిగింది

‘ఎందరో అమరవీరులు కన్న కలల సాకారం కోసం, మార్పు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, ఎన్ని ఆశలతో వేలాదిగా తరలివచ్చిన..’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాగే, సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు ఆదర్శమని, పటేల్ పట్టుదల వల్లనే హైదరాబాద్ కు విమోచనం కలిగిందని అన్నారు.

అందుకే, హైదరాబాద్ అనగానే తనకు పటేల్ గుర్తుకొస్తారని, అసలు, సర్దార్ పటేల్ లేకపోయినట్టయితే, ఈనాడు ఈ స్వేచ్ఛ లేకపోతే తెలంగాణలో మీతో ఆనందంగా మాట్లాడే అవకాశం కలిగేదే కాదు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించి పెట్టిన ఈ తెలుగు ప్రజలందరికీ శుభాభివందనాలు అంటూ కొద్ది సేపు తెలుగులో ప్రసంగించారు.

Narendra Modi
bjp
Hyderabad
lb stadium
  • Loading...

More Telugu News