Flip Cart: మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

  • 6-8 మధ్య బిగ్ షాపింగ్ డే
  • ఆడియో యాక్ససరీస్‌పై 80శాతం
  • హోం ఫర్నీచర్‌పై 40 - 80 శాతం
  • ‌రూ.4,999కే ఆసుస్‌ జెన్‌ఫోన్‌ లైట్‌ ఎల్‌1

ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి శుభవార్త. ఫ్యాషన్, హోం ఫర్నీచర్ దగ్గర నుంచి టెలివిజన్, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌ను ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ నెల 6-8 మధ్య మూడు రోజులపాటు బిగ్ షాపింగ్ డే పేరిట ఈ సేల్స్ నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. రెడ్‌మీ నోట్ 6 ప్రో, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌, ఆసుస్‌ జెన్‌ఫోన్‌ లైట్‌ ఎల్‌1, పోకో ఎఫ్‌1, రియల్ మి సీ1 స్మార్ట్‌ఫోన్లతో పాటు పలు కంపెనీల ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనుంది.

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ లైట్‌ ఎల్‌1 ఫోన్ రూ.2000 డిస్కౌంట్‌తో ‌రూ.4,999కే లభించనుంది. దీనికి సంబంధించిన ఫ్లాష్ సేల్‌ను ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనుంది. రెడ్‌మీ నోట్ 6 ప్రో అయితే ఈ మూడు రోజులపాటు ఫ్లాష్ సేల్‌లో ఉంటుంది.

బ్యూటీ, టాయ్స్‌, స్పోర్ట్స్‌, బుక్స్‌ ఇతర వస్తువులపై 80శాతం రాయితీని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫ్యాషన్‌, హోం ఫర్నీచర్‌పై 40 నుంచి 80 శాతం, స్మార్ట్‌ఫోన్లతో పాటు టెలివిజన్లు, గృహోపకరణాలపై 70 శాతం, ల్యాప్‌ట్యాప్‌, కెమెరా, ఆడియో యాక్ససరీస్‌పై 80శాతం రాయితీని ప్రకటించింది. ఇది మాత్రమే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులకు మరో 10% అదనంగా డిస్కౌంట్‌ లభించనుంది.

  • Loading...

More Telugu News