Mukesh Ambani: వెంకన్న చెంత ముఖేష్ అంబానీ... స్వామి పాదాల చెంత ఇషా వివాహ ఆహ్వాన పత్రిక!

  • అర్చన సేవలో పాల్గొన్న ముఖేష్ అంబానీ
  • వెంట కుమారుడు అనంత్ అంబానీ కూడా
  • ఆశీర్వచనం పలికి శేషవస్త్రాన్ని బహూకరించిన అర్చకులు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌‌ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, ఈ వేకువజామున తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుని దర్శించుకున్నారు. స్వామివారి అర్చన సేవలో పాల్గొన్న వీరు, ఇషా అంబానీ వివాహ ఆహ్వాన పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు.

ముఖేష్ ఫ్యామిలీకి స్వాగతం పలికిన ఆలయ అధికారులు, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ముఖేష్, అనంత్ లకు వేదాశీర్వచనం పలికి స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించి, తీర్థప్రసాదాలను అందించారు. వెంకటేశ్వరునిపై అమిత భక్తి ప్రపత్తులున్న ముఖేష్ అంబానీ, తన ఇంట ఏ శుభకార్యం తలపెట్టినా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే.
Mukesh Ambani
Anant Ambani
Tirumala
Esha Ambani
Wedding Card

More Telugu News