Jahnavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాజమౌళి సినిమాలో జాహ్నవి!
  • ప్రత్యేకమైన సెట్లో రాజశేఖర్ 'కల్కి
  • నందమూరి తారకరత్న 'అమృతవర్షిణి'

*  ఇటీవలే కథానాయికగా బాలీవుడ్ కి పరిచయమైన దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి త్వరలో టాలీవుడ్ రంగ ప్రవేశం చేయనుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాం చరణ్ హీరోలుగా రూపొందుతున్న చిత్రంలో ఓ నాయికగా ఆమె నటించే ఛాన్స్ వుంది. ఈ విషయమై ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట.
*  'గరుడవేగ' సినిమా తర్వాత డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కల్కి'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది.
*  నందమూరి తారకరత్న హీరోగా 'అమృతవర్షిణి' అనే చిత్రం రూపొందుతోంది. నాగరాజు నెక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో మొదలైంది. ఇందులో మేఘశ్రీ కథానాయికగా నటిస్తోంది. 

  • Loading...

More Telugu News