Gujarath: ఇలా కోరిక తీర్చావంటే అలా ట్రాన్స్ ఫర్ చేయిస్తా.. మహిళా హోంగార్డులకు పోలీస్ పెద్దల వేధింపులు!

  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
  • కమిషనర్ ను ఆశ్రయించిన 25 మంది మహిళలు
  • సీఎం, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లిన కమిషనర్

గుజరాత్ పోలీస్ శాఖలో లైంగిక వేధింపుల కలకలం చెలరేగింది. నచ్చిన చోటుకు బదిలీ కావాలంటే తమ కోరిక తీర్చాలని సీనియర్ అధికారులు వేధిస్తున్నారంటూ 25 మంది మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వీరు సూరత్ పోలీస్ కమిషనర్ సతీశ్ శర్మకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ఈ లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతోందని వాపోయారు.

ఈ మేరకు కమిషనర్ సతీశ్ కు నాలుగు పేజీల లేఖను అందజేశారు. ట్రాన్స్ ఫర్ కావాలంటే కోరిక తీర్చాలనీ, లేదంటే భారీగా నగదు ముట్టజెప్పాలని ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. మరో సీనియర్ అధికారి అయితే ‘యూనిఫాం సరిచేసుకో’ అంటూ తాకరాని చోట తాకారని ఓ హోంగార్డు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

దీంతో ఈ విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లామనీ, ఈ ఘటనపై జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ జరుపుతోందని కమిషనర్ సతీశ్ శర్మ వెల్లడించారు. ఈ ఫిర్యాదు కాపీని ముఖ్యమంత్రి రూపానీతో పాటు హోంమంత్రికి కూడా పంపినట్లు తెలిపారు. విచారణలో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News