director dasari: దర్శకుడు దాసరి శిష్యుడు రాధాకృష్ణ మృతి

  • ఫిలింనగర్ లోని నివాసంలో రాధాకృష్ణ మృతి 
  • రేపు ఉదయం మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • రాధాకృష్ణ మృతిపై దర్శకుల సంఘం సంతాపం

దర్శకుడు దాసరి నారాయణరావు శిష్యుడు రాధాకృష్ణ (74) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ లోని తన నివాసంలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు ఉదయం పది గంటలకు మహాప్రస్థానంలో రాధాకృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల దర్శకుల సంఘం సంతాపం వ్యక్తం చేసింది. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా, దాసరి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు నటించిన పలు చిత్రాలకు రాధాకృష్ణ సహాయదర్శకుడిగా పని చేశారు.

director dasari
radha krishna
demise
ntr
anr
  • Loading...

More Telugu News