Ajit jogi: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో విచిత్రం.. ఒక్కో పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న కుటుంబ సభ్యులు

  • మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుటుంబంలో వైచి         +++++++++త్రి 
  • ఒక్కొక్కరు ఒక్కో పార్టీ నుంచి పోటీ
  • అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న జోగి కుటుంబం

ఎన్నికల్లో ఎన్నెన్నో సిత్రాలు కనిపిస్తుంటాయి. అయితే, ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ఇప్పటి వరకు విన్నదానికి కొంచెం భిన్నమైనదే. చత్తీస్‌గఢ్ ఎన్నికలు ఇందుకు వేదిక కానున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ (జేసీసీ) అధ్యక్షుడు అజిత్ జోగి కుటుంబం ఈసారి దేశవ్యాప్త చర్చకు కారణమైంది. ఆయన కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మూడు వేర్వేరు పార్టీల నుంచి బరిలోకి దిగనుండడమే ఆ చర్చకు కారణం.

కాంగ్రెస్ నేత అయిన అజిత్ జోగి రెండేళ్ల క్రితం పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఆయన భార్య రేణు మాత్రం ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే అయిన రేణు ఈసారి కూడా కాంగ్రెస్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి మాత్రం తండ్రితోనే ఉన్నారు. జేసీసీ తరపున మార్వాహి నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే, ఆయన భార్య రిచా మాత్రం బీఎస్పీ నుంచి పోటీ పడుతున్నారు. ఇలా కుటుంబంలోని ముగ్గురూ మూడు పార్టీల నుంచి బరిలోకి దిగుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు మళ్లింది.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేసీసీ-బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. అందులో భాగంగా బీఎస్పీ 35 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీఎస్పీ ప్రకటించిన జాబితాలో రిచా పేరు కూడా ఉండడంతో ఒక్కసారిగా ఈ విషయం చర్చనీయాంశమైంది. అజిత్ జోగి ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు ప్రకటించగా, ఆయన కుటుంబంలోని ముగ్గురూ గెలిచే అవకాశం ఉందన్నది విశ్లేషకుల మాట.

  • Loading...

More Telugu News