Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌పై పోటీకి రెడీ అవుతున్న వాజ్‌పేయి మేనకోడలు

  • రాజ్‌నంద్‌గావ్ నుంచి రమణ్‌సింగ్ బరిలోకి
  • గట్టి పోటీ ఇవ్వనున్న కరుణ శుక్లా
  • 18 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా విడుదల

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌పై పోటీకి మాజీ ప్రధాని వాజ్‌పేయి మేనకోడలు కరుణ శుక్లా రెడీ అవుతున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గం నుంచి రమణ్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఆయనను ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థిని దింపాలని యోచిస్తున్న కాంగ్రెస్‌కు కరుణ శుక్లా కనిపించారు. చాలాకాలం క్రితమే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆమెను ఇప్పుడు అస్త్రంగా వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. వచ్చేనెల 12న రాష్ట్రంలో జరగనున్న తొలి విడత ఎన్నికల కోసం కాంగ్రెస్ తాజాగా 18 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

Chattisgarh
Ramansingh
Vajpayee
Karuna Shukla
Election
Congress
  • Loading...

More Telugu News