Hanuma Vihari: నిన్న టెస్టు జట్టులో స్థానం... నేడు నిశ్చితార్థం... బిజినెస్ మేన్ కుమార్తెను పెళ్లాడనున్న హనుమ విహారి!

  • ఇటీవలే టెస్టు జట్టులో స్థానం పొందిన హనుమ విహారి
  • నేటి రాత్రి ప్రీతి రాజ్ తో నిశ్చితార్థం 
  • ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తున్న ప్రీతి

హైదరాబాదీ యువ క్రికెటర్ హనుమ విహారి ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే భారత టెస్టు జట్టులోకి తొలిసారిగా ప్రవేశించిన హనుమ, ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఏరువ రాజేంద్ర రెడ్డి కుమార్తె ప్రీతి రాజ్ తో హనుమ విహారి వివాహం నిశ్చయమైంది.

నేడు వీరిద్దరికీ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరగనుంది. మాదాపూర్ లోని ఆవాస హోటల్ ఇందుకు వేదిక కానుండగా, పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. స్వీడన్ లో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన ప్రీతి, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తోంది.

  • Loading...

More Telugu News