Aravinda Sametha: వసూళ్లలో ‘అరవింద సమేత’ మరో అద్భుత రికార్డ్!

  • రికార్డుల మీద రికార్డులు
  • రూ.100కోట్ల గ్రాస్ వసూలు
  • 18 వరకూ ఎదురు లేదు

ఈ నెల 11న విడుదలైన ‘అరవింద సమేత’ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జగపతి బాబు నటన విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది.

ప్రస్తుతం ఈ చిత్రం మరో రికార్డును సృష్టించింది. తొలి వారాంతంలోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు ఈ నెల 18 వరకూ పోటీ లేదు. దీంతో ‘అరవింద సమేత’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ నెల 18న హీరో రామ్ నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం విడుదల కాబోతోంది. అప్పటి వరకూ ‘అరవింద సమేత’కు ఎదురు లేదు. ఈ చిత్రంలో సునీల్, నవీన్ చంద్ర, రావు రమేష్ తదితరులు కీలకపాత్ర పోషించారు.

More Telugu News