బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి కేటీఆర్ కు ఆహ్వానం
- వచ్చే నెల 6, 7 తేదీల్లో సింగపూర్ లో సదస్సు
- పలు అంశాలపై ప్రసంగించనున్న కేటీఆర్
- ఈ ఆహ్వానంపై కేటీఆర్ సంతోషం
వచ్చే నెల 6, 7 తేదీల్లో సింగపూర్ లో ఈ సదస్సు జరగనుంది. నగరీకరణ, పట్టణ మౌలిక వసతులు, ఐటీ అంశాలపై ఈ సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఎనిమిది దేశాల నుంచి సుమారు మూడు వందల కంపెనీల ముఖ్య కార్య నిర్వాహక అధికారులు, వివిధ దేశాల రాజకీయ నాయకులు, వక్తలు హాజరుకానున్నారు. కాగా, ఈ ఆహ్వానంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.