ప్రియుడు మోసం చేశాడన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

  • పురుగుల మందుతాగి ప్రాణాలు తీసుకున్న వైనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
  • హైదరాబాద్‌ ఆల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
ప్రేమ బాసలు చేసి...ఊహల పల్లకిలో ఊరేగించి...ఆశల సౌధాన్ని నిర్మించి కుప్పకూల్చిన ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు ప్పాడింది. హైదరాబాద్‌ నగరం ఆల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కనాజిగూడలో నివాసం ఉంటున్న అనిత పదో తరగతి వరకు చదివి ఇంట్లో ఖాళీగా ఉంటోంది.

ఈ క్రమంలో, అనిత, అదే వీధికి చెందిన జగ్గు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, కొన్నాళ్లకే జగ్గు ముఖం చాటేయడం మొదలు పెట్టడంతో అనిత తీవ్ర మనస్తాపానికి గురయింది. శుక్రవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ప్రేమ పేరుతో తమ కుమార్తెను మోసగించిన జగ్గును శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Hyderabad
alwal

More Telugu News