Tamilnadu: పక్కింటి పొలిటీషియన్ తో వివాహేతర బంధం... 150 సవర్ల నగలతో పరారైన వ్యాపారి భార్య!

  • తమిళనాడు, కన్యాకుమారి సమీపంలో ఘటన
  • వ్యాపారి, రాజకీయ నేత మధ్య లావాదేవీలు
  • పరారైన వారి కోసం గాలిస్తున్న పోలీసులు
తన పొరుగున ఉన్న ఓ రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యాపారి భార్య, ఇంట్లోని 150 సవర్ల బంగారు నగలను తీసుకుని అతనితో కలసి పారిపోయిన ఘటన తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో కలకలం రేపింది. మార్తాండం పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, మార్తాండం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి (50) ఫైనాన్స్ కంపెనీని నిర్వహిస్తుండగా, అతనికి భార్య (40), ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

వారింటికి సమీపంలోనే వివాహమై భార్యా, పిల్లలున్న ఓ రాజకీయ పార్టీ ప్రముఖుడు నివాసం ఉంటున్నాడు. వీరిద్దరి మధ్యా వ్యాపారపరమైన లావాదేవీలుండగా, తరచూ కలుసుకునేవాళ్లు. ఈ క్రమంలో వ్యాపారి భార్యతో రాజకీయ నేత వివాహేతర బంధాన్ని పెట్టుకున్నాడు. విషయం తెలిసిన వ్యాపారి వారిని మందలించాడు కూడా. ఈ క్రమంలో బుధవారం నాడు తన ఇంట్లోని 150 సవర్ల బంగారం నగలతో ఆమె అదృశ్యం అయింది. తన ప్రియుడితో కలసి ఆమె పారిపోయినట్టు విచారణలో వెల్లడికాగా, వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tamilnadu
Kanyakumari
Politesian
Businessman
Wife

More Telugu News