Miryalaguda: ప్రణయ్ కి 'వీర భోగ వసంత రాయలు' పాట అంకితం!

  • మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్
  • ప్రణయ్ కు అంకితమిస్తూ 'వీర భోగ వసంత రాయలు' తొలి పాట
  • 21న విడుదల కానున్న సాంగ్

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ కి సంతాపం తెలుపుతూ ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా, తాజాగా 'వీర భోగ వసంత రాయలు' టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు హీరోలుగా రూపుదిద్దుకుంటున్న సినిమా, తొలి పాట 21వ తేదీన విడుదల కానుండగా, ఈ పాటను ప్రణయ్ కి, ప్రేమకోసం బలైన వారికి అంకితమిస్తున్నామని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అమృత వర్షిణి తండ్రి మారుతీరావు చేయించిన ఈ మర్డర్ సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

More Telugu News