ameerpet: అమీర్ పేటలోని స్కూల్లో అగ్నిప్రమాదం

  • సిస్టర్ నివేదిత స్కూల్ లో అగ్నిప్రమాదం
  • విద్యార్థులంతా ప్రేయర్ లో ఉండటంతో తప్పిన పెను ప్రమాదం
  • మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
హైదరాబాదులోని అమీర్ పేటలో ఉన్న సిస్టర్ నివేదిత స్కూల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం సంభవించిన సమయంలో విద్యార్థులంతా ప్రేయర్ లో ఉండటంతో, పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు, స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించిందన్న వార్త తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన స్కూలుకు చేరుకుని, తమ పిల్లలకు ఏమీ కాలేదనే విషయం తెలుసుకుని కుదుటపడ్డారు.
ameerpet
sister niveditha school
Fire Accident

More Telugu News