dera baba: జైల్లో డేరాబాబా పనేమిటి? సంపాదన ఎంత?

  • జైల్లో కాయగూరలు పెంచుతున్న డేరా బాబా
  • రోజుకు రూ. 40 కూలీ
  • నైపుణ్యం ఉన్న పనులు రాకపోవడంతో.. కాయగూరల పెంపకం
డేరా సచ్చాసౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ బాబా అత్యాచారం, హింస కేసులకు సంబంధించి 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిండే. డేరాలో సకల సుఖాలను అనుభవించిన గుర్మీత్... జైల్లో తోటి ఖైదీల మాదిరిగానే సాధారణ జీవితం గడుపుతున్నారు. జైలు పనుల్లో భాగంగా ఆయన కాయగూరలు పండిస్తున్నారు. చేస్తున్న పనికి గాను ప్రతి రోజు రూ. 40 సంపాదిస్తున్నారు. అతనికి నైపుణ్యం ఉన్న పనులు తెలియకపోవడంతో... కాయగూరలు పెంచే పని అప్పగించారు జైలు అధికారులు. నైపుణ్యంతో కూడిన పనులు చేస్తే, అతనికి మరింత ఎక్కువ కూలీ వచ్చేది. 
dera baba
ram rahim singh
jail
work
vegetables growing

More Telugu News