Krishna District: విషాదాంతం... తల్లిని కాపాడి కొట్టుకుపోయిన ఎస్ఐ మృతదేహం లభ్యం!

  • నిన్న ఆదుపుతప్పి నదిలో పడ్డ కారు
  • కారులో లభించని వంశీధర్ ఆచూకీ
  • ఈ ఉదయం మంగళాపురం వద్ద మృతదేహం
కారు అదుపుతప్పి కాలువలో కొట్టుకుపోతున్న వేళ, తల్లిని కాపాడి, ఆపై ముఖ్యమైన కాగితాలను తెచ్చేందుకు కారులోకి వెళ్లి గల్లంతైన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్ఐ వంశీధర్ మృతదేహం నేడు లభ్యమైంది. నిన్న అవనిగడ్డకు వెళుతూ కరకట్ట వద్ద వంశీధర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారును వెలికి తీసినప్పటికీ, అందులో వంశీధర్ మృతదేహం లభ్యం కాకపోవడంతో, అతను బతికే ఉంటాడని, నీటిలో కొట్టుకుపోయి, ఎక్కడో ఒక చోట ఒడ్డుకు చేరి ఉంటాడని భావిస్తున్న కుటుంబ సభ్యులు, అతని మృతదేహం లభించిందని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 వంశీధర్ ఆచూకీ కోసం నిన్నటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాలువ వెంట వెతుకుతుండగా, ఈ ఉదయం చల్లపల్లి మండలం, మంగళాపురం వద్ద అతని మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.
Krishna District
Avanigadda
Vamsidhar
Dead body

More Telugu News