bhuma akhilapriya: చిరంజీవిని కలిసిన భూమా అఖిలప్రియ.. పెళ్లికి ఆహ్వానం!

  • చిరంజీవి ఇంటికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందించిన అఖిలప్రియ
  • ఈ నెల 29న భార్గవ్ రామ్ తో అఖిలప్రియ వివాహం
  • 'సైరా' ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించిన ఏపీ మంత్రి

మెగాస్టార్ చిరంజీవిని ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ రోజు కలిశారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లిన అఖిలప్రియ... తన వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందించారు. తన వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆమె సోదరి మౌనిక, ఆమె భర్త గణేష్ రెడ్డి, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా ఉన్నారు.

ఈ నెల 29న అఖిలప్రియ వివాహం పారిశ్రామికవేత్త భార్గవ్ రామ్ తో జరగనుంది. ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో వీరి వివాహానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మరోవైపు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కూడా అఖిలప్రియ, భార్గవ్ రామ్ లు తమ వివాహానికి ఆహ్వానించారు.

చిరంజీవిని ఆహ్వానించిన విషయాన్ని అఖిలప్రియ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషిస్తున్న చిరుకు అభినందనలు తెలిపారు. 'సైరా' సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

bhuma akhilapriya
marriage
wedding invitation
Chiranjeevi
ch vidyasagar rao
Maharashtra
governor
syeraa
  • Loading...

More Telugu News