Yamuna River: వాజ్ పేయి చితాభస్మాన్ని సేకరించిన నమిత, నిహారిక!

  • యమునా తీరానికి వచ్చిన వాజ్ పేయి దత్తపుత్రిక
  • కూతురితో కలసి చితాభస్మ సేకరణ
  • పుణ్యనదుల్లో నిమజ్జనం చేయనున్న కుటుంబీకులు
దివంగత బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు జరిగిన యమునా తీరంలోని స్మృతి స్థల్ నుంచి ఆయన చితాభస్మాన్ని దత్త కుమార్తె నమిత, ఆమె కూతురు నిహారిక ఈ ఉదయం సేకరించారు. అంత్యక్రియలు జరిగిన మూడో రోజున సంచయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతం నుంచి చితాభస్మాన్ని సేకరించి మూడు కుండల్లో ఉంచారు నమిత, నీహారిక. వీటిని ప్రేమ్ ఆశ్రమ్ కు తరలిస్తామని, ఆ తరువాత ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తామని వాజ్ పేయి బంధువులు తెలిపారు. పవిత్ర నదుల్లో చితాభస్మం నిమజ్జనం చేసే కార్యక్రమానికి హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారని తెలుస్తోంది.
Yamuna River
Vajpayee
Namita
Niharika

More Telugu News