vajpayee: వాజ్ పేయిని విమర్శించాడని ప్రొఫెసర్ ను చావబాదిన దుండగులు!: బిహార్ లో దారుణం

  • వాజ్ పేయి నెహ్రూవాది కాదన్న ప్రొ.కుమార్
  • చుట్టుముట్టి చావబాదిన దుండగులు
  • వీసీ మద్దతుదారులే దాడిచేశారన్న ప్రొఫెసర్
దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకు ఓ ప్రొఫెసర్ ను దుండగులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన బిహార్ లోని మోతిహారి ప్రాంతంలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ సదరు ప్రొఫెసర్ ను పోలీసులు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.

వాజ్ పేయి మరణం నేపథ్యంలో ‘వాజ్ పేయి నెహ్రూవాది కాదు. ఆయన వాగ్ధాటితో మధ్య తరగతి భారతీయులను హిందుత్వ రాజకీయాలకు చేరువయ్యేలా చేయగలిగారు. ఆయన్ను నెహ్రూవాదిగా పేర్కొనడం చరిత్రను వక్రీకరించడమే’ అని శుక్రవారం మహత్మా గాంధీ సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో రెచ్చిపోయిన కొందరు దుండగులు మోతిహారి ప్రాంతంలో కుమార్ పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. చివరికి ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కాగా విశ్వవిద్యాలయంలో వైస్ చాన్స్ లర్ కు వ్యతిరేకంగా మాట్లాడటంతోనే కొన్ని శక్తులు తనను లక్ష్యంగా చేసుకున్నాయని కుమార్ ఆరోపించారు.
vajpayee
vc
professor
attack
Mahatma Gandhi Central University

More Telugu News