sivaprasad: టీడీపీ ఎంపీ మమ్మల్ని అవమానించాడు.. పోలీసులకు ట్రాన్స్ జెండర్ల ఫిర్యాదు!

  • విజయవాడలో ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధి  
  • తమ మనోభావాలు దెబ్బతీశారని వెల్లడి
  • వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్

పార్లమెంటులో చిత్రవిచిత్ర వేషధారణతో మీడియా దృష్టిని ఆకర్షిస్తున్న చిత్తూరు పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నేత శివప్రసాద్ ఇబ్బందుల్లో పడ్డారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ట్రాన్స్ జెండర్ వేషంలో ఆయన చేసిన హంగామాపై ఓ హిజ్రా పోలీసుల్ని ఆశ్రయించారు. ‘మోదీ బాయా’ అంటూ పాటలు పాడుతూ శివప్రసాద్ తమ మనోభావాలను దెబ్బతీశారని ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా తెలిపారు.

ఈ వ్యవహారంపై విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తన చేష్టలు, మాటలతో శివప్రసాద్ ట్రాన్స్ జెండర్ల మనోభావాలను దెబ్బతీశారని తమన్నా ఆరోపించారు. ఆపరేషన్లు చేసుకుని మహిళలుగా మారిన తమను శివప్రసాద్ తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా ప్రవర్తించినందుకు ఆయన వెంటనే  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News