karunanidhi: కరుణానిధి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు: సీఎం పళనిస్వామి

  • పన్నీర్ సెల్వంతో కలసి ఆసుపత్రికి వెళ్లిన సీఎం 
  • కరుణానిధి ఆరోగ్యం బాగానే ఉందన్న పళని స్వామి 
  • చెన్నైలో భద్రత కట్టుదిట్టం

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని... ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసి ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కరుణానిధిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కరుణానిధిని ఇప్పుడే కలిశానని... ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అన్నారు. మరోవైపు, కరుణ అనారోగ్యం నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులకు సెలవులను రద్దు చేశారు. 

  • Loading...

More Telugu News