lunar eclipse: ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ చంద్ర గ్రహణమిది!

- బ్లడ్ మూన్ గా కనువిందు చేయనున్న చంద్రుడు
- చంద్రగ్రహణం వివిధ దశల్లో మొత్తంగా 3.55 గంటలు
- 1.45 గంటలు మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం
ఈరోజు రాత్రికి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మన దేశంలో ఈరోజు 11.45 గంటలకు గ్రహణం ప్రారంభం కానుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ చంద్రగ్రహణమిదని నాసా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చంద్రగ్రహణం వివిధ దశల్లో మొత్తంగా మూడు గంటల యాభై ఐదు నిమిషాల పాటు సాగుతుంది. అయితే, ఒక గంట నలభై మూడు నిమిషాలు పాటు మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు.
ఈరోజు చందమామ సాధారణ రోజుల కంటే ఎర్రగా కనిపించనుండటంతో దీనిని ‘బ్లడ్ మూన్’ గా పిలుస్తారు. ఈ చంద్రగ్రహణాన్ని ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల వారూ వీక్షించే అవకాశం ఉంది. కాగా, చంద్ర గ్రహణం కారణంగా ఇప్పటికే, ఏపీ, తెలంగాణలోని పలు ఆలయాలు మూతపడ్డాయి.